న్యూ ఇయర్ వేడుకల కోసం రౌడీ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..?

న్యూ ఇయర్ వస్తుందంటే చాలు సంబరాలు అంబరాన్ని తాకుతాయి. తమకు నచ్చిన ప్లేస్ కు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంటారు. అయితే ఈసారి కరోనా దెబ్బకు చాలామంది బయటకు వెళ్లకుండా ఇంట్లో జరుపుకుంటున్నారు. ఇక సినీ స్టార్స్ కూడా చాలామంది ఇలాగే చేస్తున్నారు. కొంతమంది మాత్రం బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా న్యూ ఇయర్ ప్లాన్ గట్టిగానే వేసినట్లు తెలుస్తుంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం గోవాకు ప‌య‌న‌మ‌య్యారు. ఈ క్రమంలో దేవ‌ర‌కొండ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ల‌గా.. అక్క‌డ కెమెరాలు క్లిక్ మ‌నిపించాయి. అందులోమాస్క్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. కాగా అక్కడి నుంచి వచ్చిన తరువాత విజయ్ దేవరకొండ ఫైటర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్న‌ట్లు తెలుస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ఫైట‌ర్‌ని తెర‌కెక్కిస్తుండ‌గా.. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *