సేవలు అందించే వైద్యులు దేవుళ్లతో సమానం

*జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా వైద్యులకు జనసేన అభినందనలు
*వైద్యుల సేవలకి గునుకుల కిషోర్ సెల్యూట్

జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాణాలను కాపాడే కనిపించే దేవుళ్లైన వైద్యులందరికీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నేతృత్వంలో, ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ హెచ్వోడీ డా. మస్తాన్, నారాయణ హాస్పిటల్ హెడ్ డా. సంపత్, డెల్టా హాస్పిటల్ అధినేత డా. పోకల రవి, ఎన్ఎల్ హాస్పిటల్స్ చైర్మన్ నాగేంద్రప్రసాద్ ని కలుసుకుని సన్మానించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ – “ప్రాణాంతక పరిస్థితుల్లో కూడా నిరంతరం చిరునవ్వుతో సేవలు అందించే వైద్యులు నిజంగా దేవుళ్లతో సమానం. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి రోగుల కోసం అంకితభావంతో పని చేస్తున్న వారిని మనం గౌరవించాల్సిందే,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఏటూరి రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, మహేష్, నరహరి, సుధా, శివ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment