డానియల్ శేఖర్…రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో రానా పాత్రకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఈ సినిమా కోసం 25 రోజుల పాటు కాల్ సీట్ ఇచ్చాడట. అంతేకాకుండా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. నిజానికి రానా డానియల్ శేఖర్ టీజర్ కి మాత్రం అద్భుతమైన స్పందన లభిస్తోంది.