అభివృద్ధి చేయలేని మంత్రి కాకాని సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలుకూరివారిపాలెం చెరువును ఆయకట్టు రైతులు, జనసైనికులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలుకూరివారి పాలెం చెరువు కనీసం నాలుగువేల ఎకరాలకు సాగునీరు, 10 గ్రామాలకు తాగునీరు అందించేటువంటి చెరువు. ఈ చెరువు మీద పడి ఇక్కడ నుంచి దిగుకి సముద్రానికి వెళ్లేటువంటి పరిస్థితి. అయితే మిచౌంగ్ తుఫాన్ తాకిడి వల్ల ఎగువ నుంచి వచ్చిన నీళ్ల దాటికి రివిట్ మెంట్ వాళ్ళ కట్ట సగభాగం నాలుగు అడుగుల లోతు తెగిపోతే సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం ఆ చెరువుని సందర్శించి కట్టని పరిశీలించే తీరిక లేకుండా పోయింది. కనీసం కట్ట మరమ్మతులు చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నామమాత్రపు మంత్రి మాత్రమే ఈయన రైతులకి అండగా నిలిచే స్థితిలో లేడు. చెరువులను మరమ్మతులు చేయించడం గానీ ఆలోచన లేనటువంటి పరిస్థితి. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలారా ఒక క్షణం ఆలోచించండి. ఇటువంటి మంత్రిని, వైసీపీ ప్రభుత్వం ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని అనేక చెరువులని రిపేర్ చేయించుకొని రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా తయారు చేసుకుందాం. మన సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులని అన్ని విధాల ఆదుకుందాం. తాగునీరుకి, సాగునీరుకి కొరత లేకుండా కాపాడుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి చెంచయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.