26 జిల్లాలు చేయటం వల్లన రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఓరిగేది ఏమి ఉండదు

పలాస, పరిపాలనా సౌలభ్యం అంటే ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకోవడం మరియు ప్రభుత్వ పథకాలు అందచేయటంలో అలసత్వం చూపకపోవడం. ప్రస్తుత సమస్యల మళ్లింపు చేయడానికి వైసీపీ వదిలే డైవర్షన్ రాజకీయా అస్త్రాలే ఈ మూడు రాజధానులు, 26 జిల్లాలు, జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్, ప్రతి పార్లమెంట్ కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ వంటి అంశాలు కానీ ఇప్పటివరకు ఒక్క అంశాన్ని ముందుకు తీసుకువెళ్లినా దాఖలు లేవు. ఉన్నా ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేకపోతుంటే ఇప్పుడు కొత్త జిల్లాలు విడదీసి ఏమి చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని అని కోన కృష్ణారావు అన్నారు మరో నాయకులు హరీష్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉన్న సమస్యల పై దృష్టిపెట్టాలి కానీ లేని సమస్యలు తీసుకువచ్చే ఆలోచనలు విరమించుకోవాలి అని కోరారు. మీకు రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే ప్రతి పార్లమెంట్ కేంద్రంలో ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం లేకుండా ఎయిమ్స్ తరహా ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక నవోదయ పాఠశాల, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మరియు వృత్తి విద్యా కోర్సెస్ చేయటానికి ఒక యూనివర్సిటీ, పర్యావరణ అనుకూల పరిశ్రమలను ప్రభుత్వఒ ఏర్పాటు చేయాలి లేదా అటువంటి పరిశ్రమలను ఆహ్వానించాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ క్లస్టర్, బలమైన కోస్టల్ బెల్ట్ వున్నా ఉత్తరాంధ్రకి మన మత్సకారుల ఆర్థిక అభివృద్ధికి మత్స్య నౌకాదళం ఇక్కడ ఏర్పాటు చెయ్యాలి అని అన్నారు.