జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, ప్రజాసేవను ధ్యేయంగా పెట్టుకొని, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు, నేటి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతుల మీదుగా ప్రారంభమైన “శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం” పితాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కేంద్రం వ్యవస్థాపకుడు, తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి & సాయిప్రియ సేవాసమితి అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో ప్రతీ శనివారం పితాపురం పశువుల సంత వద్ద రైతులు, మధ్యవర్తులు, ఆసుపత్రులకు వచ్చే ఔట్‌పేషెంట్లకు ఉచితంగా ఆహారపానీయాలను అందిస్తున్నారు. ఈరోజుతో 153వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 650 మందికి అన్నపానీయ వసతులు కల్పించడం జరిగింది.
వడ్డన కార్యక్రమంలో జ్యోతుల నాని, జ్యోతుల సూర్య, విప్పర్తి శ్రీను వంటి కార్యకర్తలు పాల్గొని సేవలందించగా, పలువురు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని భోజనం చేశారు. ఈ సేవా సంకల్పానికి తోడుగా నిలుస్తున్న సాయిప్రియ సేవాసమితి సిబ్బందికి, వంట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వ్యవస్థాపకుడు జ్యోతుల శ్రీనివాసు చరవాణి ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. 153 వారాలు కొనసాగుతున్న ఈ నిరంతర మానవతా సేవకు సమాజం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Share this content:
Post Comment