జనసేన అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజాసేవ స్ఫూర్తితో, మాజీ జిల్లా జనసేన అధ్యక్షులు & ప్రస్తుత రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం ద్వారా ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద నిర్వహించబడుతోంది. ఈ శనివారంతో (03-05-2025) 144వ వారం పూర్తవుతోంది. ఈ రోజున రైతులు, పశువుల బేరాల మధ్యవర్తులు, ఆసుపత్రులకు వచ్చిన ఔట్ పేషెంట్లు కలిపి సుమారు 650 మందికి ఉచితంగా భోజనాన్ని అందించారు. వడ్డన కార్యక్రమంలో జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ, “ఈ సేవా కార్యక్రమం రైతుల కోసం, సామాజిక సేవలో భాగంగా కొనసాగించబడుతోంది. ఇది మేము రాజకీయ లక్ష్యాలతో కాదు, ప్రజల అవసరంతో చేస్తూన్న సేవ” అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమానికి స్వచ్ఛందంగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ఫోన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సాయిప్రియ సేవాసమితి మాతృసంస్థగా నిలిచి, పిఠాపురం ప్రాంత ప్రజల మద్దతుతో విజయవంతంగా కొనసాగుతోంది.
Share this content:
Post Comment