ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలోని హనుమాన్ సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మే నెలలో ప్రారంభించిన “డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం” జూన్ నెల చివరి వరకు విజయవంతంగా కొనసాగింది. బ్రిటిష్ కాలంలో సేవా తపస్సుతో వేలాదిమందికి ఆహారం అందించిన మహానీయురాలు డొక్కా సీతమ్మ ఆత్మవిశ్వాసాన్ని స్మరించుకోవాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఈ యోచనను ముందుకు తీసుకొచ్చినవారు జనసేన పార్టీ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఆయన మార్గదర్శకత్వంతో, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో 50 రోజులపాటు నిరంతరంగా సేవ కొనసాగించారు. ప్రతిరోజూ 100 లీటర్ల మజ్జిగను పంపిణీ చేస్తూ మొత్తం 5000 లీటర్లకు పైగా మజ్జిగ ప్రజలకు అందించబడింది. ఈ కార్యక్రమానికి ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ గారు నిధులు సమకూర్చి పర్యవేక్షణ చేశారు. టౌన్ నాయకుడు గడ్డం వంశీ కృష్ణ అన్ని రోజుల్లోనూ నిష్ఠతో సమన్వయం నిర్వహించారు. పలు మండలాల జనసేన నేతలు, కార్యకర్తలు, ముఖ్య అతిథులు – పసుపులేటి శ్రీరామ్, సయ్యద్ అక్బర్ బాషా, ఓరుగంటి ప్రమీలా, తోడేటి వెంకటేశ్వర్లు, వనం పవన్ కుమార్, యేళ్ళంటి ప్రసాద్, స్వచ్ఛంద సేవకులు సాయి, గణేష్ తదితరుల సహకారంతో ఈ కార్యక్రమం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఆఖరి రోజున చదలవాడ హరీష్, దాడి బాను కిరణ్, చిన్నా జనసేన తదితర నేతలు పాల్గొని సేవా కార్యక్రమానికి ముగింపు పలికారు. జనసేన పార్టీ ఈ చలివేంద్రం ద్వారా ప్రజల్లో సేవా తత్త్వాన్ని బలంగా నిలిపింది.
Share this content:
Post Comment