రైతన్న ఆకలి తీర్చడం కోసమే డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం

  • శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం
  • శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం 2 సంవత్సరాల నుండి నిర్వహణ- చైర్మన్ జ్యోతుల శ్రీనివాసుగంగభవానీ

పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి సాయిప్రియసేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగభవానీ శ్రీనివాసు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు గత 53 వారాలుగా ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 54వ వారం ఈ శనివారం రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి 600 మందికి అన్నపానీయంసదుపాయమును కల్పించారు. వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల గోపి, కీర్తి చిన్నా, జ్యోతుల వీరబాబు,
జీలకర్రబాను, నేమాల కన్నయ్య, జ్యోతుల నాని, విప్పర్తి కృపాకర్, సాయిప్రియసేవా సమితి సిబ్బంది రేలంగిసూర్య, సఖినాల వీరబాబు, విప్పర్తిశ్రీను తమ సేవలను స్వచ్చందంగా అందించారు. శ్రీమతి డోక్కాసీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తూన్న వారిని ప్రత్యేకంగా సాయిప్రియసేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగభవానీ శ్రీనివాసు చరవాణిలో వారిని ఆమె అభినందించారు.