రక్త దానం చెయ్యండి – ప్రాణ దాతలు కండి

*రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు, వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా శనివారం రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ సందర్శించారు. రక్తదానం చేసిన దాతలను ఆయన స్వయంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు చేపట్టిన రక్తదాన ప్రాముఖ్యతను చాటే ఫ్లకార్డ్‌ల ప్రదర్శన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని స్ఫూర్తి నింపారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా రక్తదానం అవసరాన్ని చాటి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment