వరద బాధితులకు కోటి రూపాయలు విరాళo

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి జనసేన అధినేత, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఈ ఆపత్కర కాలంలో జనసేనాని మరోసారి మానవతను చాటుకున్నారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారాయన. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్.

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో… చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు.