*జనసేన పార్టీ తరఫున విరాళం అందించిన పులిపాటి అనిల్ కుమార్..
*గ్రామీణ ప్రజలతో మమకారం చాటిన పులిపాటి అనిల్ కుమార్
అత్మకూరు రూరల్ మండలం మురుగల్ల గ్రామం అరుంధతి వాడ కాలనీలో నిర్వహించనున్న శ్రీ పాండురంగ స్వామి ఉత్సవానికి జనసేన పార్టీ తరఫున రూ.5,000 విరాళాన్ని జనసేన సీనియర్ నేత మరియు ఐటీ కోఆర్డినేటర్ పులిపాటి అనిల్ కుమార్ అందించారు. ఈ విరాళం, వెంకటేశ్వర్లు ఆహ్వానంతో అందజేయబడింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ – “జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మానికి మద్దతుగా ఎల్లప్పుడూ నిలుస్తూ, ప్రజల నమ్మకాలను గౌరవిస్తారు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్మకూరు టౌన్ నాయకుడు వంశీ కృష్ణ, ఎ.ఎస్.పేట ఇంచార్జ్ అఖ్బర్ బాషా, సీనియర్ నాయకులు పసుపులేటి శ్రీరామ్, వనం పవన్ కుమార్, భాను కిరణ్, శ్రీను, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు. ఈ విరాళం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ ప్రజలతో ఉన్న మమకారాన్ని, ధార్మిక విలువల పట్ల కమిట్‌మెంట్‌ను మరింతగా ప్రదర్శించింది.
Share this content:
Post Comment