డొంకతిరుగుడొద్దు సీఎం: ఇంచార్జ్ టి.సి.వరుణ్

  • పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాలి
  • పవన్ కళ్యాణ్ నామస్మరణ వైసీపీకి తారక మంత్రంలా ఉంది
  • మీ ప్యాలెస్ భాగోతాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినవే
  • వ్యక్తిగత విమర్శలు మాని ప్రజలకు ఏం చేశారో చెప్పండి
  • ప్రజా స్వేచ్ఛను హరిస్తే జనసైనికులుగా ప్రతిఘటిస్తాం.
  • ఘాటుగా స్పందించిన జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్

అనంతపురం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలను సంధిస్తే సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్పడం ఏమిటి. డొంక తిరుగుడు వద్దు సీఎం. సూటిగా సమాధానం చెప్పండి అంటే సామర్లకోటలో జరిగిన సభలో సీఎం ఏదేదో మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే సరైన గుణపాఠం చెబుతామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఘాటుగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నామస్మరణ వైసిపికి తారకమంత్రంలా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్థాయి దిగజార్చుకొని వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. మేము కూడా స్థాయి తగ్గించుకొని మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారో మీ నాన్న చనిపోయినప్పుడు కలకత్తాలో మీరు ఏం చేస్తున్నారో, బెంగళూరు ప్యాలెస్ లో మీరు ఏమి చేసేవారో, మీ రాసలీల గురించి ఎవరికి తెలియదు అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. వీధి వీధిలో రచ్చబండల మీద మీ బండారం బయట పెట్టాల్సి వస్తుందన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న వ్యవస్థీకృత ప్రశ్నలకు అంతే హుందాగా సమాధానం చెబితే బాగుంటుంది. అంతకుమించి వ్యక్తిగత దూషణలకు దిగినా రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరించిన జనసైనికులుగా ప్రతిఘటిస్తామని టి.సి.వరుణ్ పునరుద్ఘాటించారు.