* ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణ అభివృద్ధిలో దాతల సహకారం మరువలేనిదని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, లోతట్టు ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్న ఎన్.వి. సత్యనారాయణ మిత్రబృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రత్యేక కార్యక్రమాలకు వేదికగా మారుస్తామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

Share this content:
Post Comment