అన్నదానానికి దాతల సహకారం అభినందనీయం: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, బలుసులమ్మ అన్నదానానికి ఒక టన్నుకు పైగా (1000కేజీలు) సోనా మైసూరి రైస్ అందించిన జనసేన నాయకులు జనసైనికులు మరియు వారి స్నేహితులు. బలుసులమ్మ అన్నదానానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం బలుసులమ్మ ఆలయం ఉగాది ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం నిర్వహించే అన్నదానానికి జనసేన నాయకులు జనసేన సైనికులు వీర మహిళలు అందించిన 1090 కేజీల బియ్యాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు (అంజి) కి అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న అన్నదానానికి భక్తులు భారీగా హాజరవుతున్నారనీ అన్నారు. దీనికి దాతల సహకారం కూడా బాగుందని కితాబిచ్చారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, వీరి స్నేహితులు రాజకీయాల్లోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుంటారని నిరూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఆలయ నిర్వహకులు శ్రీరంగం అంజి, నీలం సురేష్, జనసేన నాయకులు వర్తనపల్లి కాశి, అడపా ప్రసాద్, పుల్లా బాబి, పైబోయిన వెంకటరామయ్య, కేశవభట్ల విజయ్, చాపల రమేష్, కాజులూరి మల్లేష్, అత్తిలి బాబి, వాకానాని, నల్లగంచు రాంబాబు, కూచిపూడి రత్నాజీ, దాగరపు శీను, ఎర్రంశెట్టి శ్రీను, తాడి సతీష్, ఏపూరి సాయి, టమాటపు రాము, పిల్ల నాగ శ్రీనివాస్, కోట శ్రీరామ్, షేక్ నబి, కాళ్ల గోపికృష్ణ, అడబాల మురళి, అడ్డగర్ల సూరి, మద్దాల మణికుమార్, ఎస్విఎన్ సత్తిబాబు, బైనపాలెపు ముఖేష్, యజ్జడ అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment