వ్యర్ధాలు కలిసిపోయి నీరు కలుషితమవుతుంది పట్టించుకోరా??

జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రాజాన వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం ధరి బలిఘట్టం ఉత్తర వాహిని ప్రవహించే నది పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ పరిసరాలు స్థానికంగా ఉన్నటువంటి లింగాపురం మరియు బలిఘట్టం స్థానిక ప్రజలు విజ్ఞప్తి మేరకు సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి సమస్యను గుర్తించగా నర్సీపట్నం టౌన్ లో ఉన్నటువంటి వ్యర్ధాలు మొత్తం ఉత్తర వాహిని వద్ద ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు కానీ బలిఘట్టం ఉత్తర వాహిని ప్రవహించే నది పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల వర్షాకాలంలో మరియు ఇతర రోజుల్లో కూడా చెత్త కుప్పలు కుప్పలుగా పోయడం వలన వ్యర్ధాలు తాలూకా కలుషితమైన నీరు పూర్తిగా ఉత్తర వాహినిలో కలుస్తుంది ఈ సమస్య వలన ఉత్తర వాహినిలో స్నానాలు ఆచరించేటువంటి భక్తులకు చర్మ వ్యాధులు వస్తున్నాయని అంతేకాకుండా చుట్టుపక్కల ఉండే రైతులు పశువులు ఉత్తర వాహినిలో ఉండేటువంటి నీరు తాగడం వలన పశువులు కూడా తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని అంతేకాకుండా డంపింగ్ యార్డ్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు పక్కనే చెత్త వేయడం వలన లింగాపురం వెళ్లే గ్రామస్తులు తీవ్ర దుర్గంధంతో వెళ్లలేని పరిస్థితి ఉందని ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే మరియు మున్సిపాలిటీ కమిషనర్ సంబంధిత అధికారులు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేసి డంపింగ్ యార్డ్ వద్ద కలుషితమవుతున్న నీళ్లు పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా డంపింగ్ యార్డ్ నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా వేరే చోటికి మార్చే వలసిందిగా జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను గూర్చి జిల్లా కలెక్టర్ దృష్టికి జనసేన తరపున తీసుకువెళుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూది చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, గూడెపు తాతబాబు, నాగు, కొత్తకోట రామ శేఖర్, మల్లాడి శ్రీను, గండం దొరబాబు, వేగిశెట్టి శ్రీను, వెంకటరమణ పాల్గొన్నారు.