ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ వాతావరణాన్ని కలుషితం చేయకండి: జనసేన

తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ లో నుంచి “జూ పార్క్” రోడ్డును కలుపుతూ నగరపాలక సంస్థ అధికారులు 100,80 అడుగుల రోడ్ల ప్రతిపాదనలపై పోలీసు, ఎస్వీ యూనివర్సిటీ, టీటీడీ ఉన్నతాధికారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి సాధ్యసాద్యాలు పరిశీలించి విద్యార్థిని, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎందరో విద్యార్థినీ విద్యార్థులకు సరస్వతి నిలయం అనేకమంది టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతోపాటు లేడీస్, జెంట్స్ హాస్టల్స్, ఉద్యోగస్తుల క్వార్టర్స్ హెల్త్ సెంటర్ లు వున్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి కేటాయించిన స్థలం రోజురోజుకు కర్పూర హారతిలా కరిగిపోతోందని, ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పచ్చటి చెట్లతో, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మన రాష్ట్రంతో పాటు దేశ విదేశాలలో అత్యున్నతమైనటువంటి స్థానాలను అధిరోహించి ఎస్ వి యూనివర్సిటీ పరపతిని పెంచుతున్నారని, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో లేడీస్ హాస్టల్స్ వున్నాయి బయటి వ్యక్తులు, ఆకతాయిలు ప్రైవేట్ వాహనాలతో క్యాంపస్ లోకి ప్రవేశించి జరగరాని సంఘటనలు జరిగితే క్షణాలలో జూ పార్క్ రోడ్డు ద్వారా ఊరు దాటే ప్రమాదం ఉంది కనుక మహిళలకు రక్షణ కరువవుతుందని, క్యాంపస్ లోకి భారీ వాహనాల రాకపోకలతో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని, యూనివర్సిటీ అధికారులు వాటిని నివారించడం కష్టతరమవుతుందని సోమవారం జనసేన నాయకులు ఆకేపాటి సుభాషిని, హెమ కుమర్, మునస్వామి, రమేష్ నాయుడు, గుట్ట నాగరాజు, మనోజ్, హేమంత్, బాలాజీ, ఆదికేశవులు, శంకర్, గోపి తదితరులతో కలిసి జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి యూనివర్సిటీ వి.సి కి ఈ రోడ్డు పనులను తక్షణమే నిపివేయాలని వినతి పత్రం అందజేశారు.