వాలంటీర్లచే బలవంతంగా రాజీనామాలు చేయించడానికి ప్రయత్నించవద్దు

  • ఇది ఎన్నికల కమీషన్ నియమావళి ఉల్లంఘనే..

నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి నాయకులు పీఎంఆర్ హైస్కూల్ నందు వాలంటీర్ల సమావేశం ఏర్పరిచి, రాజీనామా చేసి తమతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి ఇంట్లో అనుభవిస్తున్న సంక్షేమ పథకాలను చూపిస్తూ ఎలక్షన్ కాన్వాస్ చేయాలని బలవంత పెడుతున్న వైఎస్సార్ సీపీ నాయకుల్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, ఎన్నికల కమిషన్ సూచనలని బేఖాతరు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సిగ్గుపడాలి.. వాలంటీర్లను బలవంతంగా సమావేశానికి పిలిపించి రాజీనామా చేసి తమతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పడం సబబు కాదు. ఉద్యోగ అవకాశాల్లో కల్పించడంలో విఫలమైన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గౌరవ వేతనం పేరుతో 5000 రూపాయలు అంటే రోజుకు దాబదాపు 150 మాత్రమే చెల్లించి ప్రజలకు సేవ చేయాలనుకునే వాలంటీర్లని ఈ విధంగా ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. వాలంటీర్లు అందరికి కూడా ఇదే విన్నపం… మీ ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని కోల్పోకండి.. రానున్న ప్రజా ప్రభుత్వంలో మీ సేవ చేస్తున్న మీ గౌరవ వేతనాలు ₹10000 కి పెంచబోతున్నాయని… ఎవరు తొందరపడి రాజీనామాలు చేయొద్దు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాదు వారి బెదిరింపులకు లొంగద్దని తెలిపారు. బలవంతంగారాజీనామాలు చేయించి వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నారని ప్రకటనలుచుకుంటున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సూచనలు బేకార్లు చేస్తుందని తెలుసుకోవాలి.
వాలంటీర్లు వాళ్లకి ఇష్టం లేకపోయినా కూడా వీరి బలవంతానికి లోబడి రాజీనామాలు చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఏ విధంగా సమావేశాలు వైఎస్సార్సీపి నాయకులు ఏర్పాటు చేసిన వాలంటీర్లు వెల్లనాల్సిన అవసరం లేదు. మరోసారి ఈ విధమైన సమావేశాలు ఏర్పరిస్తే పోలీసు వ్యవస్థతో వచ్చి వైఎస్సార్సీపి నాయకుల్ని నాయకులకి శిక్షలు అమలు అయ్యేవరకు కూడా జనసేన పోరాడుతుంది. ఈ విధంగా వెట్టి చాకిరి చేయిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందిగా జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నానని గునుకుల కిషోర్ తెలిపారు.