ఓట్ల కోసం కాపు కులాన్ని వాడుకోవద్దు

  • కులం ఓట్ల కోసమే కాపు వనసమరాధన
  • సత్తెనపల్లి జనసేన కార్యలయంలో మీడియా సమావేశం
  • వైసీపీ ఆధ్వర్యంలో వనసమరాధనలో మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలు
  • వ్యాఖ్యలను ఖండించిన జనసేన పార్టీకాపులు గురించి మాట్లాడే హక్కు మంత్రి అంబటికి లేదు

వైసీపీ ఆధ్వర్యంలో వనసమరాధనలో మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండించిన జనసేన నాయకులు మాట్లాడుతూ.. ఎప్పుడో జరిగిన రంగా హత్యను ఇప్పుడు తెరమీదకి తెస్తున్నారు. కాపు జాతి గురించే మాట్లాడే అర్హత ఏ వైసీపీ మంత్రులకు లేదు పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇప్పుడున్న వైసీపీ నాయకులకు లేదు. మంత్రి అంబటి దగ్గర కొంతమంది పాలేరు పని చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 2014,2019లో చాలా మంది కాపులు మీతో నడిచి మోసపోయారు.. వంగవీటిమోహన్ రంగా కుటుంబానికి వైసీపీ పార్టీలో అన్యాయం జరిగినప్పుడు ఈ కాపులు ఎటు వెళ్లారు.. కాపు వనసమరాధనను వైసీపీ భజన చేశారు. తిట్టడానికి సభలు సమావేశాలు పెడుతున్నారు. కులాన్ని అడ్డుపెట్టుకొని కాపు కులానికి మంత్రి హోదాలో ఏమి న్యాయం చేశారో మంత్రి అంబటి సమాధానం చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు విధి విధికి పెడతారు.
రంగా విగ్రహలు అలాగే పెట్టారా?. 9సంవత్సరాలు రాధాని ని వాడుకొని వైసీపీ పార్టీ అన్యాయం చేసింది.. ఓట్ల కోసం కాపు కులాన్ని వాడుకోవద్దు. మంత్రి అంబటి సైన్యధిపతి కాదు రాజశేఖరరెడ్డి కుటుంబ పాలేరు. మంత్రి అంబటి పేరుకే కాపు రెడ్ల కు ఊడిగం చేస్తున్నాడు. ఎన్నికలు దగ్గర పడ్డాయి మంత్రి విజ్ఞతతో మాట్లాడాలి. ఈ మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనీష్ కుమార్, నకరికల్లు మండల ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, పట్టణ నాయకులు సోమిశెట్టి సుబ్రహ్మణ్యం, తిరుమల శెట్టి సాంబశివరావు, దమలపాడు గ్రామ అధ్యక్షులు రుద్ర జల శివయ్య, కేదారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.