*శ్రీశైలం నుండి యాగంటి వరకు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాల సందర్శన
నంద్యాల జిల్లా పుణ్యభూమిగా మారింది. శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి వంటి పవిత్ర క్షేత్రాలలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు కిషోర్ బాబు కుటుంబంతో కలిసి స్వామి, అమ్మవార్ల దర్శనంతో ఆధ్యాత్మిక శాంతిని పొందారు. ఆలయ అర్చకులు వారిని ఘనంగా ఆహ్వానించి, శాలువాలు కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ప్రజలకు నమ్మకమైన పాలన అందిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలన ప్రజలకు నిరాశను మిగిల్చినదని, చంద్రబాబు – పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అంధుల సంఘం అధ్యక్షులు ఓబులేష్, ఒంగోలు జనసేన నాయకులు కిషోర్ నాయుడు, దండు మురళి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment