గోపాలపురం నియోజకవర్గంలో జనసేన, టిడిపి, బీజేపిల ఇంటింటి ప్రచారం

గోపాలపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజు నామినేషన్ సందర్భంగా శనివారం ఆనంతపల్లి సమీపంలో ఉన్న టోల్గేట్ దగ్గర గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపి నాయకులు మరియు శ్రేణులు జనసైనికులు వెంకటరాజుకి ఘన స్వాగతం పలికారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం చీపురుగూడెం, తిమ్మనపాలెం, అచ్చనపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. మూడు గ్రామాల ప్రజలు నుంచి మంచి విశ్లేషణా స్పందన వచ్చింది. ప్రజల సమస్యల గురించి వాళ్ళకి కావలసిన అభివృద్ధి గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, బీజేపి నియోజకవర్గ ఇన్చార్జి శివ నాగరాజు, బీజేపి కన్వీనర్ వాసు, గోపాలపురం నియోజకవర్గం నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు కాట్నం గణేష్, చొడశాని బాపిరాజు, దాకారపు నరసింహమూర్తి, పోసిన గణపతి మరియు తదితర మూడు పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.