కరప మండలంలో జనసేన-టిడిపి ఇంటింటికి ప్రచారం

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి మరియు శ్రీ పిల్లి అనంతలక్షి సత్యనారాయణ మూర్తి జనసేన పార్టీ సిద్దాంతాలు మరియు టిడిపి పార్టీ భవిష్యత్తకు గ్యారంటీ గురించి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా సరోజ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కొంత మంది వాలంటీర్లు ఏరకంగా ఆడవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థ వలన ఆడపిల్లల డేటా బహిర్గతం అవుతుందని వివరించడంతో నియోజకవర్గ ప్రజలనుండి విశేష స్పందన లభించింది. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.