కొవ్వూరు జనసేన ఆధ్వర్యంలో ఇంటింటికీ జనసేన

కొవ్వూరు నియోజకవర్గం, వేగేశ్వరపురం మరియు అన్నదేవరపేట గ్రామము నందు గురువారం జనసేన ఆధ్వర్యంలో ఇంటింటికీ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ వీరమహిళ సుభాషిని చిత్తే ఆధ్వర్యంలో కేలండర్ లు ఆవిష్కరించడం జరిగింది. అనంతర్స్మ్ జనసేన కార్యకర్తలు మరియు పార్టీ నాయకులతో కలసి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అదేవిదంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను అలాగే జనసేన సిద్దాంతాలను ప్రజలకు వివరిస్తూనే వై.యస్.ఆర్ పార్టీ చేసే మోసాలను, అన్యాయాలను అదేవిధంగా వై.యస్.ఆర్ పార్టీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే విధానాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరిచే విధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలలోకి లోకి తిసుకుని వెళ్లి, అదేవిధంగా జనసేన కేలండర్ లను మరియు పేదవారికి, వృద్దులకు దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. ఇదే విధంగా అన్నీ గ్రామాలు తిరుగుతూ జనంలోనే, జనంతోనే జనం కోసం ఉంటామని నాయకులు తెలియజేసారు.