లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్ల మండలం, పూతిక పేట గ్రామంలో జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికి జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూతిక పేట గ్రామస్తులు శ్రీమతి మాధవిని జన నీరాజనాలతో స్వాగతించారు. మాధవి గారు గడపగడపకు తిరుగుతూ గతంలో రెండు ప్రభుత్వాలకి మద్దతు తెలియజేసారని, ఇప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని, ప్రజల బతుకుల్లో మార్పు రావాలంటే, పారిశ్రామికంగా ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని తెలియజేసారు. గ్రామ ప్రజలు వారి సమస్యలను లోకం మాధవి గారికి వివరిస్తూ ఆ గ్రామంలో ఉన్న ఎస్.సి కాలనీల్లో ఎన్నో నెలల నుండి కాలువల్లో చెత్త పేరుకుని పోయిందని, అలాగే బోరింగ్ సమస్య, మరియు పారిశుద్ధ్యం మాధవి దృష్టి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. ఆ సమస్యలను పరీక్షించి తాను అధికారంలో లేకపోయినా ఆ సమస్యను తీరుస్తానని మాధవి మాటిచ్చారు. అలాగే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వైసీపీకి అనుకూలంగా లేకపోతే వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, వాటిని తిప్పికొట్టేలా ప్రజలందరూ అంత సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండలం నాయకులు కురుమజ్జి గోవింద్, పతివాడ శ్రీనివాసరావు, పతివాడ సువర్ణ, శీల ప్రసాద్, యడ్ల పండు, శీర శ్రీనివాసరావు, యడ్ల వెంకటేష్, కొత్తూరు శ్రీనివాసరావు మరియు జనసేన కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.