డోర్ టు డోర్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు 23వ డివిజన్లో ధొభీఖానా ప్రాంతంలోను జె. కనకరాజు ఆధ్వర్యంలోను, 20వ డివిజనులో వినాయకుడి గుడి ప్రాంతంలో ఎన్. రాజు ఆధ్వర్యంలోను జనంలోకి జనసేన మరియు పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ప్రజలకు మొదటిగా తమనాయకులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వీట్స్ అందచేసారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా పాలన చేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వ నిర్ణయాలని ప్రజలకు వివరించారు. ఆఖరికి ప్రభుత్వం జారీ చేసే జి.వోలను సైతం బహిర్గతం చేయకుండా రహస్యంగా పాలించే ప్రభుత్వం నేడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చూస్తున్నామనీ తెలియచేసారు. రాష్ట్ర ప్రజల ఆశలు అన్నీ ఆవిరి అయిపొయాయనీ, మచ్చుక్కి అభివృద్ధి అన్నది రాష్ట్రంలో లేకుండా పోయిందనీ ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.