గుంటూరు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహనీయత్వాన్ని గురించి మాట్లాడారు. వారు, “డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దళితులకే కాకుండా అన్ని జాతుల వారికి నాయకత్వాన్ని అందించారు. ఆయన గొప్పతనం, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం రూపకల్పన, మరియు అందరికీ ఓటు హక్కు కల్పనలో ఆయన కృషి అమోఘం, అనిర్వచనీయం,” అని తెలిపారు. “అయన సూచించిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమై, జనసేన పార్టీ అధ్యక్షులు అంబేద్కర్ వాది. ఆయన కలలు కన్న సమాజం సాధించినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి,” అని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, జిల్ కార్యదర్శి మేకల రామయ్య, కార్పొరేటర్ యిర్రి ధనలక్ష్మి, పలు డివిజన్ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment