బనగానపల్లె జనసేన ఆధ్వర్యంలో ఘనంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు

బనగానపల్లె పట్టణంలో అవుకు మెట్ట దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకుడు భాస్కర్ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ భారత తొలి నాయ్యశాఖ మంత్రిగా, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మన రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ని కొనియాడారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అభినందనీయని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజా అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడిన వ్యక్తని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెద్దయ్య, విక్రమ్ , అజిత్ రెడ్డి, కిరణ్ రెడ్డి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.