డాక్టర్. బి.ఆర్ అంబెడ్కర్ 131వ జయంతి వేడుకలు

అనంతపురం, ప్రపంచ మేధావి, భారతరాజ్యగం నిర్మాత, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో అనంతపురం లలితకళాపరిషత్ నందు పౌరాణిక నాటక ప్రదర్శనకు సాకే మల్లికార్జున సభాద్యక్షతన.. విశిష్ట అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్. బి.ఆర్. అంబెడ్కర్ చిత్ర పటానికి పూలతో సత్కరించి,టెంకాయా కొట్టి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఎస్సీ జనసంఘం రాయలసీమ కళావేదిక ఆధ్వర్యంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణను ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసగనిపల్లి కుళ్లాయప్ప మరియు ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చామలూరు రాజగోపాల్ శాలువా కప్పి పుష్పగుచ్చం తో మెమోంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ చామలూరు హరిత రాజగోపాల్, లలిత కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జి. పద్మజ గారు ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుళ్లాయప్ప, రాయలసీమ కళా వేదిక నాయకులు హరినాథ్, శివనంద, బండారు నాగేష్, వెంకటేశ్వరరావు, రజిని బాయ్, తదితరులు పాల్గొన్నారు.