- పిజి చదువుపై వెళ్తున్న వైద్యాధికారికి సత్కార సభ
- డాక్టర్ చెన్నాయ్ సేవలు ప్రసంసించిన పలువురు వక్తలు
గుర్ల, మానవతావాది డాక్టర్ చెన్నాయ్ గుర్ల పీ హెచ్ సీ ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందించారని మండల పరిషత్ పరిపాలనాధికారి ఏ టి వరప్రసాద్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ సమావేశ భవనంలో మంగళవారం పీజీ పై వెళ్తున్న పీ హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ చెన్నాయ్ కి సన్మాన సభ ఏర్పాటు చేసి సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సేవ చేయడంతో పాటు ప్రజలు వ్యాధులు బారిన పడకుండా అవగాహన పరచడంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా హోమియోపతిక్ వైద్యాధికారి డాక్టర్ వెంకటమధు, వైద్యాధికారి శ్రీధర్ లు మాట్లాడుతూ వైద్యాధికారిగా నాలుగేళ్లుగా ఆయన ఆయన అందించిన సేవలు వర్ణనాతీతమన్నారు. ఈ సందర్బంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పీ హెచ్ సీ కి వచ్చిన రోగులతో ఓపిక, సహనంగా ఉంటూ తగిన వైద్యాన్ని సకాలంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, హోమియోపతీక్ వైద్యాధికారి వెంకట మధు బాబు, యూడీసీ వి.పద్మావతి, సూపర్ వైజర్లు సురేష్, గణపతి, సుజాత, హెల్త్ అసిస్టెంట్ ఉమా, రాజు, స్టాఫ్ నర్సులు శ్రీదేవి, ఎర్ణమ్మ, బేబీ రాణి లతో పాటు ఎం ఎల్ పీ హెచ్ పీ లు, ఫార్మాసిస్ట్ ఎం.వెంకటలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, ఏ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment