కాకినాడ జిల్లా చిత్రాడ, పిఠాపురం వద్ద మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ (ప్లీనరీ) సభ ఏర్పాట్లపై వరుసగా వార్ రూమ్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో అరకు పార్లమెంట్ నుంచి సమన్వయకర్తగా పాడేరు ఇంచార్జీ డా. గంగులయ్య పాల్గొని, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవంలో సాంస్కృతిక విభాగ బాధ్యతలను డా. వంపూరు గంగులయ్య నిర్వహిస్తున్నారు. జనసైనికులకు వినోదాన్ని అందించేందుకు వివిధ రాష్ట్ర, అంతర్రాష్ట్ర నృత్యకళారూపకాలు, సాంప్రదాయ సంగీత ప్రదర్శనలతో ప్రముఖ రాష్ట్ర కళాకారులను ఆహ్వానిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా డా. గంగులయ్య జనసేన అగ్రనాయకత్వంతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వీర మహిళల ప్రతినిధులు, హరిప్రసాద్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ ల తో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. 14వ తేదీన జరిగే సభను విజయవంతం చేయడంపై సమగ్ర చర్చ జరిపి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.
Share this content:
Post Comment