అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. జనసేన నాయకులు, వీరమహిళలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం మొత్తం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. డా. గంగులయ్య పార్టీ ఆవిర్భావం నుంచీ అత్యంత నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా అధిష్ఠానానికి మంచి గుర్తింపు సంపాదించిన నాయకుడని నేతలు కొనియాడారు. అసెంబ్లీ టికెట్ చేజారినా, ఆయన నిరుత్సాహం చెందకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తూ కీలక పాత్ర పోషించిన నాయకుడిగా పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉండే ఆయన సేవా మార్గంలో కూడా పెద్ద పాత్ర వహిస్తూ, రాజకీయంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తూ ముందుండడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం ఆధ్వర్యంలో చింతపల్లి మండలానికి చెందిన మర్రి, మనోహర్, వంతలా పరమేశ్ లు డా. గంగులయ్య చేతుల మీదుగా కండువా కప్పుకొని జనసేనలో చేరారు. ఈ వేడుకలో జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొర్ర కమల్ హాసన్, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, పాడేరు మండల అధ్యక్షుడు నందోలి మురళీ కృష్ణ, ఐటీ ఇంచార్జ్ సాలెబు అశోక్, టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నాగేష్, ఇతర మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డా. గంగులయ్య మాట్లాడుతూ, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాంటి గొప్ప కుటుంబాన్ని ఇచ్చిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Share this content:
Post Comment