అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ కు మద్ధతు తెలిపిన డా.ఘంటసాల వెంకటలక్ష్మి

దెందులూరు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో బాగంగా దెందులూరు నియోజకవర్గం, దెందులూరు గ్రామంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపి, వారి న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకటనాగరాజు, ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, జనసేన పెదవేగి మండల జనసేన నాయకులు మేడిచెర్ల కృష్ణ, ఏలూరు నగర జనసేన నాయకులు తాతపుడి చందు మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.