పెద్ద అగ్రహారం గ్రామంలో డా. వంపూరు గంగులయ్య పర్యటన

పాడేరు: జనసేన పార్టీ నాయకులు మారుమూల గ్రామ సమస్యలు అధ్యయనంలో భాగంగా గత కొన్ని రోజులుగా నియోజకవర్గ పరిధిలో గ్రామ పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ కార్యక్రమంలో భాగంగా గూడెం మండలంలో గల పెద్ద అగ్రహారం గ్రామాన్ని సందర్శించారు. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు విమర్శ, ప్రతి విమర్శల్లో భాగంగా ఈ గ్రామ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గ్రామానికి చేరుకున్న జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య మరియు మండల నాయకులు, స్థానిక గ్రామప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గూడెం పంచాయితీకి చెందిన ఈ గ్రామం సుమారు 15 కిలోమీటర్ల చివారు దూరంలో ఉంటుంది. ప్రధానంగా రహదారి వ్యవస్థ బాగోలేదు, త్రాగునీటి వ్యవస్త లేదు. ప్రభుత్వ ప్రతినిధులు నాడు-నేడు అంటూ విధ్యకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటూ ఊదరగొడుతుంటారు. కానీ అక్కడ పాఠశాల భవనం లేదు. గ్రామస్తులే స్వయంగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుని ఒప్పంద ఉపాధ్యాయురాలు ద్వారా పాఠశాల విద్య తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా గంగులయ్య గ్రామస్తులతో మాట్లాడుతూ మనం ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులను నిలదీయాలని, ప్రశ్నించే హక్కు మనకు ఉందని తెలిపారు. మేము ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని ఇవాళ గిరిజన జాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నామని గ్రామస్తులనుద్దేశించి తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో అనేకసార్లు స్పందన కార్యక్రమానికి, చివరగా ఎమ్మెల్యే గారి గృహానికి చేరుకుని మా గోడు వెల్లబుచ్చుకున్నామని అయినా కూడా ఎటువంటి స్పందన లేదని అన్నారు. మేమంతా జనసేన పార్టీకి మా వంతుగా అండగా ఉంటామని మా గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు లక్ష్యాలు నచ్చి అగ్రహారం గ్రామస్తులు డా. గంగులయ్య చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీ లోకి చేరారు. ఈ కార్యక్రమంలో గూడెం మండల నాయకులు బత్తుల సిద్దార్ధ్ మార్క్, కొయ్యం బాలు, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, చింతపల్లి మండల నాయకులు బుజ్జిబాబు, స్వామి, రామకృష్ణ, పాడేరు నాయకులు అశోక్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.