డా. వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, బడిమేల గ్రామము మరియు పంచాయితిలో జనసేన పార్టీ తరుపున నిర్వహించిన జగనన్న ఇల్లు ప్రజల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య పాడేరు, జి.మాడుగుల మండల నాయకులు జగనన్న కాలనీలను సందర్శించారు. ఈ సందర్బంగా డా..గంగులయ్య మాట్లాడుతూ.. బడిమేల గ్రామంలో జగనన్న ఇల్లు పధకం ద్వారా ఇల్లు మంజూరు చేశారు.. బిల్లు మరిచారు అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఈ ప్రభుత్వం గడప గడప కి వైసీపీ ప్రభుత్వం అంటూ యాత్ర చేస్తున్నారు ఆ గడపల్లో సందర్శిస్తే ఈ విషయాలు మీ దృష్టిలో రాలేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇల్లు పధకం అట్టహాసంగా ప్రారంభించి ఇప్పుడు మీరు ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసి ప్రజలు మా వైపే ఉన్నారని ఎలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలకు కల్పించాల్సిన మౌళికసధుపాయలను కూడా రాజకీయాంశలుగా చూడటం బహుశా వైసీపీ మార్క్ రాజకీయం కాబోలు గిరిజన ప్రాంతాల్లో గృహపధకాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే పేద ఆదివాసీలు సొంత ఇంటి కల జీవిత కల ఆ కలను ఒక కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు జగనన్న ఇల్లు జగమొండి బిల్లు పధకం చాలా చక్కగా అమలు చేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ దాష్టికాలు చేస్తారు త్వరలోనే మీ ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని ఉద్గాటించారు. గడప గడపకు వైసీపీ అంటూ ప్రచార ఆర్భాటాలకు పోతున్నారు తప్పితే ఆ గడప ఈ పేద ప్రజలు గడప నిర్మాణానికి కొరకు ఎంత వరకు మేలు చేసారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఇన్చార్జ్ డా వంపూరు గంగులయ్య గారితో పాటుగా పాడేరు మండల నాయకులు, తరడ రమేష్ నాయుడు, కొర్ర కమల హసన్, వంతల ఈశ్వర్ నాయుడుఅశోక్ సాలేబు, సత్యనారాయణ మజ్జి అశోక్ కుమార్ కిలో, సంతోష్ మజ్జి, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, పవన్, మస్తాన్, చందు, తల్లే కృష్ణ, గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు.