ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పనిచేస్తా.. డాక్టర్ కందుల

  • ప్రజాసేవే ధ్యేయం
  • ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా
  • రాజకీయాలకతీతంగా సేవలు
  • 68వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పనిచేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం గురువారం నాటికి 68వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటి గడపగడపకు వెళ్లి ప్రజలను కలిశారు. వారి సమస్యలను నియరుగా అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 34వ వార్డులో జెండా చెట్టు ప్రాంతంలో పుష్పవతి అయిన జెస్మిత అనే అమ్మాయికి అలాగే లక్ష్మీ దేవి పేటలో పుష్పవతి అయిన శ్రావణి అనే మరొక అమ్మాయికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సేవ చేయడమే తన ధ్యేయంగా చెప్పారు. నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలకు ప్రభుత్వం నుంచి సరైన సహాయము లభించక ఎన్నో సమస్యలతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. అధికార పార్టీ కేవలం తమ పార్టీ వాళ్లకు మాత్రమే సహాయం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి మాత్రం ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఎన్నో అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కొని ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల మంచి కోసం తను ఏమి చేయడానికి అయినా సరే సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమం నియోజకవర్గంలో కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నరేష్, ప్రసాద్, హరీష్, ఆంటోనీ శేఖర్, రఘు, మణి, సాయి, సునీత, మంగ, రాజేశ్వరి, దుర్గా, కుమారి, దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్ తో పాటు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.