మృతురాలి అంత్యక్రియలకు డా. కందుల ఆర్థిక సాయం

విశాఖ, సేవే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, తన పరిధిలోవున్న సాయాన్ని వారికి అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటున్నారు. ఈ క్రమంలో 32వ వార్డు, ఏడుగుళ్ళ ప్రాంతానికి చెందిన వందేళ్ళ అప్పయ్యమ్మ మృతి చెందగా, ఆమె అంత్యక్రియలకు డాక్టర్ నాగరాజు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వార్డులో మాత్రమే కాకుండా, నియోజకవర్గం అంతటా ఎవరికైనా అవసరం ఏర్పడితే, తాను ముందుండి తోడ్పాటునిస్తాను” అని అన్నారు. అలాగే, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో, మరిన్ని మానవతా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశంగా, తనకు సహకరిస్తున్న కూటమి నాయకులకు, వార్డు ప్రజలకు, జనసైనికులకు, వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this content:

Post Comment