మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహయం

విశాఖపట్నం, 32వ వార్డు (అల్లిపురం, నెరేళ్ల కోనేరు): స్థానికంగా నివసించిన రాజారావు ఇటీవల మరణించగా, అతని కుటుంబానికి జనసేన పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, “ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. వారెవరైనా సంక్షోభంలో ఉన్నా, నేను 24 గంటల్లో సహాయ సహకారాలు అందజేస్తాను” అని పేర్కొన్నారు. అలాగే, తన వార్డులో అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కాగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, నీలబాబు, రవి తదితరులు పాల్గొని మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు.

Share this content:

Post Comment