విశాఖ దక్షిణం, స్థానిక 31వ వార్డు కృష్ణా గార్డెన్స్ ప్రాంతంలో మృతి చెందిన కేసిబోయిన అప్పుల సూరి కుటుంబానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అపన్న హస్తం అందించారు. మృతుని భార్య శారదకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. వార్డులో ప్రతి ప్రాంతానికి నేరుగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి సత్వరమే చొరవ చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అన్నారు. తాను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తనను నేరుగా గాని లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించవచ్చని తెలిపారు. తాను ప్రజల మనిషినని, ప్రజల మంచి కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా, రాజేశ్వరి, ప్రియాంక, లక్ష్మి, ఆదిబాబు, అనిత తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment