మహాత్ముడికి ఘన నివాళులర్పించిన డాక్టర్ మాధవ రెడ్డి

తెలంగాణ, శేరిలింగంపల్లి: గాంధీ జయంతి సందర్భంగా సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు రమేష్, ప్రదీప్, పుష్ప, మద్దూరి నాగలక్ష్మి, శ్రవణ్, హనుమంత్ నాయక్, హరి నాయక్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.