డా. కందుల కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం

విశాఖ దక్షిణ నియోజకవర్గం: జనసేన నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అల్లిపురం కార్యాలయంలో మంగళవారం ఉదయం మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకురావంలో మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఆయన స్ఫూర్తిదాయక జీవితం ఎంతోమందికి ఆదర్శనీయమని అన్నారు. గాంధీజీ అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడవాలని పేర్కొన్నారు. అహింసతో ఆయన చేసిన పోరాటం భారతదేశంలో కాకుండా ప్రపంచాన్ని సైతం చైతన్యం చేసింది అన్నారు.
ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వెల్లడించారు.