ఏ.పి.మెడికల్ కౌన్సిల్ సభ్యురాలిగా డాక్టర్ మల్లీశ్వరి..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యురాలిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు, కాపు మహిళా నేత డాక్టర్ మల్లీశ్వరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర వైద్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మువ్వా తిరుమల కృష్ణ బాబు జారీ చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన వైద్య వృత్తిలో ఉన్న కుటుంబాల లోనూ,అనేక మంది మహిళా వైద్యులలో డాక్టర్ మల్లీశ్వరి పేరును ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా చెప్పుకో వచ్చును. అంతే కాకుండా ఆమె ఉభయ గోదావరి జిల్లాల్లోనే బాగా పేరున్న గైనకాలజిస్టు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆమె ప్రజ్ఞా పాటవాలను, ఆమె కుటుంబం ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడానికి చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ఆమెను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించడం జరిగింది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం నందు రాష్ట్ర వైద్య ఆరోగ్య కౌన్సిల్ లో సముచితమైన స్థానాన్ని పొందిన డాక్టర్ మల్లీశ్వరికి, ఈ సదవకాశాన్ని ఆమెకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి లోకేష్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు బలిజ సామాజిక వర్గం తరుపున ఏ.పి.కాత్వా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమతం. సుబ్బారావు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డి.రామ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి అమిరిసెట్టి హాజరత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగేశ్వరమ్మ,జిల్లా మహిళా విభాగం కార్యదర్శి కంటే రమణి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తోట పెద మాలకొండయ్య, కందుకూరు నియోజకవర్గ కాత్వా సంఘం అధ్యక్షుడు కొరివి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాయుడు మాల్యాద్రి, మహిళా కార్యదర్శి తోట పద్మావతి, ఉపాధ్యక్షురాలు గంగిశెట్టి సుహాసిని, కాపు బలిజ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షురాలు శైలజా నాయుడు, కందుకూరు నియోజక వర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చదలవాడ కామాక్షీ నాయుడు, ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రియాంక తదితరులు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Share this content:

Post Comment