పలమనేరు జనసేన నాయకులకు దిశానిర్దేశం చేసిన డా.పసుపులేటి హరిప్రసాద్

పలమనేరు నియోజకవర్గం నుండి పూలచైత్యన, శ్రీమతి మంజుల, హరిష్ రాయల్, సామల సుబ్రహ్మణ్యం రెడ్డి , మధుసూదన్, ట్రైలర్ రాజు మరియు శివ ఆధ్వర్యంలో జిల్లా అధినాయకుడు గౌరవనీయులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. శ్రీ హరిప్రసాద్ గారు పలమనేరు నియోజవర్గంలో పార్టీని విజయం దిశగా తీసుకుపోవడానికి మార్గదర్శకాలు సూచించారు. శ్రీ హరిప్రసాద్ ప్రసంగం విన్న తరువాత పలమనేరు జనసేన నాయకులు గ్రామాగ్రామానికి జనసైనికులను మరియు బూత్ ఏజెంట్లను తయారుచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఆకేపాటి సుభాషిని, పగడాల మురళి చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ చిన్నా రాయల్ పాల్గొన్నారు.