తిరుపతి, రాధా – రంగా మిత్రమండలి తిరుపతి ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి రంగా గారి సేవా తత్వాన్ని స్మరించుకున్నారు.
Share this content:
Post Comment