తిరుమల శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సమేతంగా ఈరోజు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో పావనమైన అనుభూతి అని పేర్కొన్న ఆయన, భక్తులకు శుద్ధమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న టీటీడీ అధికారులను కొనియాడారు. అన్నప్రసాద కేంద్రంలో పరిసరాలను పరిశీలించిన ఆయన, అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొంటున్న సిబ్బందిని ఉత్సాహపరిచిన హరిప్రసాద్, “భక్తులకు సేవ చేయడం అంటే స్వామి వారికి చేసినట్టే” అని తెలియజేస్తూ, కొంతమంది సేవాదారులకు సూచనలు కూడా అందించారు. ఈ సందర్భంగా తిరుమలలోని సేవా కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment