డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం, కరివేపాకు పేట నందు డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పూల మాలవేసి అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అనుచరిస్తూ సమసమాజ సాధనకై పోరాడిన వ్యక్తిగా డా.బాబు జగ్జీవన్ రామ్ ని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డా.బాబు జగజీవన్ రామ్ అంటే బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి లాంటివారు 50 సంవత్సరాలకు పైగా పార్లమెంటు ఏరియానుగా 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా అనేక మంత్రి పదవులకు అలంకరణ తెచ్చినటువంటి అనేక శాఖలో వ్యవసాయ శాఖ రక్షణ శాఖ, కార్మిక శాఖ, రైల్వే శాఖ అనేక శాఖలకి నిజమైన మంత్రిత్వత్వం అంటే ఏంటో తెలిపిన వ్యక్తి మన డా.బాబు జగ్జీవన్ రామ్. ఆయన వ్యవసాయ శాఖ చేస్తున్నప్పుడు హరిత విప్లవం తీసుకొచ్చిన మహనీయుడు అలాగే 1971 లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో గెలవడానికి అన్ని రకాల వ్యూహాలు కావలసిన రక్షణ ఏర్పాట్లను అందించి భారతదేశంలో ఒక ఖ్యాతిని పెంచిన మహోన్నత వ్యక్తి డా.బాబు జగ్జీవన్ రామ్ ముఖ్యంగా అతి చిన్న వయసులోనే పార్లమెంటు ఏరియాను అతి చిన్న వయసులో క్యాబినెట్ లోకి వెళ్లిన వ్యక్తి భారతదేశ తొలి ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ ఆయన ఆ రోజుల్లో ప్రధాని అవ్వాల్సిన వ్యక్తి అయినప్పటికీ ఆ రోజుల్లో కూడా కొన్ని రాజకీయ శక్తుల కారణాలవల్ల దళితుల అవకాశాన్ని కోల్పోయారు ఇప్పుడు కూడా అదే రాజకీయ శక్తిలు కొంతమంది బడుగు బలహీన వర్గాలకు అధికారం అందుకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ ఆనాటి మహనీయుల స్ఫూర్తితో ఆదర్శాలతో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ని వచ్చే 20024 ఎలక్షన్ లో జనసేన పార్టీని గెలిపించుకుని బడుగు బలహీనవర్గాలకు నిజమైన న్యాయం రాజ్యాధికారం జనసేన తోటే సాధ్యమని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు అత్తమూరి డేవిడ్, వేమగిరి రమేష్, పెద్దాడ సత్తిబాబు, మోర్త నాగేశ్వరరావు, వేదాల రాము, అయినవిల్లి రాజ్ కుమార్, జే వెంకటరమణ, నియోజకవర్గ నాయకులు ఎక్స్ ప్రెసిడెంట్ గరగ సత్యానందం, బొజ్జ గోపికృష్ణ, మచ్చ శ్రీనివాస్, దుడ్డు రాంబాబు, పల్నాటి మధుబాబు, మోటూరి మహేశ్వరరావు, కూరడా సత్తిబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.