మహాత్మ జ్యోతిరావు పూలే కి ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు ఎండిఓ ఆఫీస్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో మొదటి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే జ్యోతిరావు ఫూలే బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు, దేశంలో అంటరానితనం, కులవ్య వస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకుండా సమాజం అభివృద్ధి చెందదని భావించి, స్త్రీలు విద్యావంతులు కావాలి దేశంలో తొలి బాలిక పాఠశాలను ప్రారంభించారు. సత్యశోధన మండలి ఏర్పాటు చేసి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. అక్షర ఉద్యమం చేపట్టి బహుజనుల జీవితాలలో జ్ఞాన వెలుగులు నింపిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనది. కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయనే ఆలోచన, కులరహిత సమాజం కోసం, మహిళా సాధికారత కోసం వందేళ్ళకు పూర్వమే కృషి చేసిన దార్శనికులు జ్యోతిరావు పూలే. సమసమాజం కోసం పూలే ఆశయ సాధన మన లక్ష్యం కావాలి.మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను, ఆయన తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తున్నాం అంటూ ఇప్పుడున్నటువంటి రాక్షస పాలన నుండి కాపాడాలంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న ఒక మహాత్మ జ్యోతిరావు పూలే, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ లాంటి మహోన్నత వ్యక్తులు ఆశయాలను కలిగిన వ్యక్తి జనసేన పార్టీ అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రానున్న ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకొని మా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి న్యాయం చేకూర్చుకుంటామని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరిపి శ్రీను, అరిపి చిన్న వెంకటేష్, బొజ్జ గోపికృష్ణ, జలిగంపల సుబ్బారావు, గొల్లపల్లి గంగ, బోడకుర్తి చిన్న, సుంకర శ్రీనివాస్, గటెం సాయి, కర్ని గంగాధర్, గటెం శ్రీనివాస్, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.