మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం, ఉప్పాడ జక్షన్ నందు భారీ కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పాలుపంచుకున్నారు. వేడుకలలో భాగంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కేక్ ను కట్ చేసి జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నపు చక్రధర్ రావు, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్కర్ నాయకులు పల్లేటి బాపన్న దొర, మచ్చ శ్రీనివాస్, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపికృష్ణ, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, వీరం రెడ్డి అమర్, పల్నాటి మధుబాబు, కోన రాంబాబు, కారపురెడ్డి వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.