అన్నసంతర్పణలో పాల్గొన్న డాక్టర్.పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శనివారం శ్రీ కృష్ణ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అన్నసంతర్పణ నిమిత్తం 2116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముసిరి కళ్యాణ్, మతం సతీష్, మొల్లి చిన్న, సప్ప సత్తిబాబు, పూడి సతీష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందినటువంటి గొల్లపోలు మండలం పార్టీ అధ్యక్షులు అయినటువంటి అమరాధి వల్లి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత కొణెదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు ఆయన సేవా స్ఫూర్తితో అమరాధి వల్లి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో అమరాధి వల్లి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా పిఠాపురం నియోజకవర్గంలో చేయడం జరుగుతుందని డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.