శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తన స్వగ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సీతారామ నూతన రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని శ్రీరాములవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ సీతారామ నూతన రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి గాను స్వామివారికి 5116 రూపాయలు విరాళాలు కనిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్లా వెంకట దినేష్, వాకపల్లి సూర్య ప్రకాష్, పిల్లా వీరబాబు, ఎక్స్ సర్పంచ్ బొంతు లచ్చ రావు, బొంతు నాగు, మాస పెద్దపుత్రయ్య, తుట్ట నాగేశ్వరరావు, నాని, మరియు జన సైనికులు గ్రామ పెద్దలు కమిటీ వారితో కలిసి పాల్గొనడం జరిగింది.