పవన్ కోసం పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

  • పవన్ సీఎం కావాలని పాదయాత్ర
  • 13న చిన్న తిరుపతికి జనసేన పాదయాత్ర
  • గతంలో అన్నవరం ఇప్పుడు చిన్న తిరుపతి
  • 2024లో పవన్ ను సీఎం చేయడమే లక్ష్యం

కాకినాడ/పిఠాపురం: జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో సీఎం కావాలి అని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో చిన్న తిరుపతికి పిఠాపురం పాదగయ నుంచి మే 13వ తేదీన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పిఠాపురం సూర్యారాయ గ్రామధాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం తెలిజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని గతంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర నిర్వహించడం జరిగింది అని ఇప్పుడు దివిలి దగ్గర చిన్నతిరుపతి పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. తొలిత పాదయాత్ర పోస్టర్ ను డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో మత్స్య కార రాష్ట్ర నాయకులు కంబాల దాసుబాబు, మత్స శ్రీనివాసరావు, వెన్నపు చక్రధరరావు, ఇంటి వీరబాబు, బొజ్జా గోపిక్రిష్ణ, గేదెల వెంకటరమణ, మర్రి దొరబాబు, గొల్లపల్లి శివ, బొజ్జా బులిరాజు, వీరంరెడ్డి అమర్, పెర్నీడి చక్రనారాయణ, గాది అజయ్, పల్నాటి మధుబాబు, కారపురెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.